దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్-13 అత్యంత వైభంవంగా రాత్రి ప్రారంభమైంది. 2010 నుండి అప్రతిహతంగా హోస్ట్ గా కొనసాగుతున్న సల్మాన్‌ఖాన్ 13వ సీజన్ కి కూడా హోస్ట్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ ఈ సారి షోలో ఫైనల్స్ నాలుగు వారాల పాటు జరుగుతుందన్నారు. చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుందన్నారు.
ఈసారి షోలో 13 మంది కంటెస్టెంట్‌లతో పాటు ఒక ప్రత్యేక అతిథి కూడా ఉండనున్నారు.గతానికి భిన్నంగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్లో బాలీవుడ్ భామ అమీషా పటేల్ పెత్తనందారుగా వ్యవహరించనున్నారు. అమేషా ఇంటి సభ్యులపై పరిమిత అధికారాలు కలిగి, వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచే బాధ్యత నెరవేరుస్తారని సమాచారం. గతంలో ఇలా బిగ్ బాస్ హౌస్ లో సభ్యులను పరిశీలించే ఒక ఇంచార్జ్ ఉండటం అనేది లేదు. ఐదుగురు పురుష కంటెస్టెంట్లను పరిచయం చేసిన సల్మాన్ తరువాత మహిళా కంటెస్టెంట్లను హౌస్‌లోనికి ఆహ్వానించడంతో షో ప్రారంభమైంది కాగా ఈ షో 15 వారాల పాటు సాగనున్నది
ఇక సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది . ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.
