ఛార్మికి గురించి మనకు తెలియని విషయం

charmi

హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారారు. పూరి ఛార్మి నిర్మాతలుగా మొదటి ప్రయత్నంగా జ్యోతి లక్ష్మీ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ మూవీకి దర్శకత్వం పూరి వహించగా ఛార్మి టైటిల్ రోల్ చేశారు. ఐతే ఈ చిత్రం వారికి నిరాశే మిగిల్చింది. ఆ చిత్రం తరువాత వీరిద్దరూ కలిసి రోగ్, పైసా వసూల్, మెహబూబా చిత్రాలు తెరకెక్కించారు. కానీ వీటిలో ఏ ఒక్క చిత్రం వారికి విజయం చేకూర్చలేదు.

ఇక వారి ఐదవ ప్రయత్నంగా అనేక వ్యయప్రయాసలకోర్చి చేసిన ఇస్మార్ట్ శంకర్ ఇన్నేళ్ల నిరీక్షణకు తగిన బంపర్ హిట్ అందించింది. అటు కమర్షియల్ గా ఇటు కాన్సెప్ట్ పరంగా ఈ మూవీ మంచి విజయం సాధించింది. నిర్మాతగా మొదటి విజయాన్ని అందుకున్న ఛార్మి ప్రముఖ హీరోయిన్ కి డబ్బింగ్ కూడా చెప్పారట. 2007లో కృష్ణ వంశీ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చందమామ చిత్రంలో కాజల్ పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్నీ పూరి పుట్టినరోజు వేడుకలో నటుడు ఉత్తేజ్ చెప్పారు.

పంజాబీ కుటుంబానికి చెందిన ఛార్మి తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పడం విశేషమనే చెప్పాలి. ఇక పూరి ఛార్మి కలిసి మరో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు. వాటిలో పూరి తనయుడు హీరోగా వస్తున్న రొమాంటిక్ చిత్రం కాగా మరొకటి విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ.

Exit mobile version