దిలీప్ శ్రావణి హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఆనంద్ కానుమోలు తెరకెక్కిస్తున్న చిత్రం తొంగి తొంగి చూడమాకు చందమామ. గురు రాఘవేంద్ర సమర్పణలో ఏ సునీత మోహన్ రెడ్డి నిర్మాత గా హరి వల్లభ ఆర్ట్స్ బ్యానర్ పై తొంగి తొంగి చూడమాకు చందమామ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర యూనిట్ మెగాస్టార్ నటించిన సైరా చిత్రానికి బెస్ట్ విషెస్ చెప్పారు. సైరాతో తెలుగు సినిమా మరో కొత్త చరిత్రను సృష్టించాలని, ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పదనం తెలియజేయాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.
దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ…”సైరా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. సైరా తెలుగు సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లే చిత్రం కావాలని కోరుకుంటున్నాం. మా సినిమా తొంగితొంగి చూడమాకు చందమామ గురించి చెప్పుకుంటే…ఇదొక ఈతరం ప్రేమకథ. నేటి యువత ఎలా ఉన్నారో చూపిస్తుంది. ప్రేమంటే తెలియకుండా, అమ్మాయిలతో సరదాగా ఉంటే చాలనుకునే కుర్రాడికి..నిజమైన ప్రేమంటే ఏంటో తెలియజేస్తుందో అమ్మాయి. అనుకోని మలుపులు తిరిగిన కథలో వీళ్లిద్దరు ఎలా ఒక్కటయ్యారన్నది కథాంశం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంటుంది. మహిళల గొప్పదనం చెప్పేలా సినిమా ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం” అన్నారు.
కుమార్ సాయి, అనంత్, లావణ్య, మహేంద్రనాథ్, మాధవీ ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, ఎడిటర్ – ఈశ్వర్ 57, సినిమాటోగ్రఫీ – వివేక్ రఫీ ఎస్కే, సాహిత్యం – బాలాజీ, ఆర్ట్ – రమేష్, కొరియోగ్రఫీ – శ్రీనివాస్, వినయ్, ఫైట్స్ – రియల్ సతీష్
