కొద్దిసేపటి క్రితం రామ్ గోపాల్ వర్మ ఓ అరుదైన వీడియో తన ట్విట్టర్ అకౌంటులో పంచుకున్నారు. దానితో పాటు ఆనాడు నేను చెప్పిన ప్రకారం చిరు సైరా చేస్తున్నారు అని ట్వీట్ చేయడం జరిగింది. చిరంజీవి సినీరంగాన్ని వదిలేసి రాజకీయాల వైపు వెళ్లిన సమయంలో జరిగిన ఓ వేడుకలో రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ చిరు మరలా సినిమాలు చేయాలనీ ఆకాంక్షించారు. పూరి చిరుతో 150చిత్రం చేసేది నేనే అనగా, వర్మ…, ఆతదుపరి చిత్రం నాది అని చెప్పడం గమనార్హం.
దీనికి సమాధానంగా చిరు నాకు చేయాలనీ ఉంది…,కానీ అమితాబ్ గారు ఒక గెస్ట్ రోల్ చేయాలి అని చెప్పగా పక్కనే ఉన్న అమితాబ్ గారు…,చిరుని ఉద్దేశిస్తూ మీరు మూవీ చేస్తే నేను ఖచ్చితంగా గెస్ట్ రోల్ చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం 150 వ సినిమా చేయడం జరిగిపోయాయి. ఐతే సైరాలో చిరు ఆనాడు కోరినట్లు అమితాబ్ గెస్ట్ రోల్ చేయడం గమనార్హం. దర్శకులు మారినా ఆరోజు వేదికపై వర్మ చెప్పినట్లు చిరు 150 మరియు 151వ సినిమాలు చేశారు.
Whatever I ever said about Mega star Chiranjeevi garu was in his best interest #Syeraa https://t.co/yO7xtIQfum
— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2019
