రామ్,పూరి, ఛార్మి ఈ ముగ్గురికి ఒకే ఒక చిత్రం గుండెల నిండా ఆనందం నింపింది. వారు కోరుకున్నదానికి రెండింతల విజయం కట్టబెట్టింది. అదే ఇస్మార్ట్ శంకర్ మూవీ. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 75కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. డైరెక్టర్ గా పూరి, నిర్మాతగా ఛార్మి, హీరోగా రామ్ అరుదైన, అవసరమైన విజయాన్ని అందుకున్నారు. అందుకే ఈనెల 28న పూరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని రీరిలీజ్ చేయడం జరిగింది.
కాగా ఇస్మార్ట్ శంకర్ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి హీరో రామ్ పుట్టిన రోజు కానుక ఇచ్చాడు. ఆయనకు విలువైన గోల్డ్ ఫాంటమ్ వైర్ లెస్ స్పీకర్ ను బహూకరించాడు. ఈ స్పీకర్ లో ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ వింటూ పూరి ఎంజాయ్ చేశారు. పూరి ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఛార్మి ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ స్పీకర్ ఖరీదు దాదాపు 4 వేల డాలర్స్. ఇక పూరి నిర్మాతగా కుమారుడు ఆకాశ్ పూరీ నటిస్తున్న ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు విడుదల చేయడం జరిగింది.
Looooveeeee u our ustaaaad @ramsayz for this auwsum Bday gift to @purijagan .. he is flying high ???????????????? @DEVIALET #goldphantom ???????????? pic.twitter.com/eo4205tbl6
— Charmme Kaur (@Charmmeofficial) September 30, 2019
