పింక్ తరువాత పవన్ కళ్యాణ్ క్రేజీ మల్టీస్టారర్..?

Pawan RamCharan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీకి సర్వం సిద్ధం అవుతుంది. నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉండగా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీ పింక్ కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తుండగా ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్. కాగా సోషల్ కాన్సెప్ట్ ప్రధానంగా సాగే ఈ మూవీలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా హీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశం ఉండదు. పవన్ సీరియస్ పొలిటీషియన్ గా కొనసాగుతున్న తరుణంలో ఈ సోషల్ కాన్సెప్ట్ ఉన్న కథ అతనికి సూట్ అవుతుందని ఎంపిక చేశారు.

ఐతే ఈ చిత్రం తరువాత పవన్ చేసే మూవీపై ఓ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. పవన్ మెగా అభిమానులకు కిక్కెక్కించే విధంగా చరణ్ తో మల్టీస్టారర్ చేయనున్నారని తెలుస్తుంది. గతంలో కొన్ని వేడుకలలో చిరంజీవి, మరియు చరణ్ ఈ విషయంపై మాట్లాడటం జరిగింది. కాబట్టి పింక్ రీమేక్ తర్వాత పవన్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన మల్టీ స్టారర్ చేస్తారని కొన్ని మీడియా వర్గాల భోగట్టా. పింక్ రీమేక్ కొరకు కేవలం 25రోజుల లోపు కేటాయించారట పవన్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివర్లో చరణ్ పవన్ ల మల్టీస్టారర్ మొదలయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరివాదన.

Exit mobile version