ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కొద్దిరోజులుగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూలు కొరకు ఇటీవలే ఎన్టీఆర్ వైజాగ్ వెళ్లడం జరిగింది. కాగా మన్యం వేదికగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నైజాం పాలకులను ఎదిరించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. పోడు వ్యవసాయం చేసే తెగల కష్టనష్టాలు, నిజాం వారి సైన్యం పై ఆయన గెరిల్లా యుద్దాలు వంటి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. వారం రోజులుగా ఈ షెడ్యూలు జరుగుతుండగా చివరి దశకు చేరుకుందని సమాచారం. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఎన్టీఆర్ లుక్ లీక్ కావడం జరిగింది. దీనిపై సీరియస్ అయిన రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.
మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తుండగా అతనికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా లండన్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. డి వి వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కానుంది.
