మనాలిలో నాని ‘వి’ కొత్త షెడ్యూల్ !

v
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కలిసి చేస్తోన్న మల్టీ స్టారర్ “వి”. కాగా తాజగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు మనాలిలో స్టార్ట్ అయింది. నాని అండ్ మిగిలిన కీలకపాత్రల పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పక్కా యాక్షన్ తో సాగుతుందట.

కాగా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ కథానాయికలుగా నటించనున్నారు. నాని ఇంతకు ముందేన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నారని.. అది నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ రోల్ అని సమాచారం. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Exit mobile version