మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ నుండి దొరికిన విరామాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం విశాఖలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ నందు కేవలం ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. రామ్ చరణ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతానికి లేకపోవడంతో ఆయన బ్రేక్ తీసుకున్నారు. కాగా రామ్ చరణ్ వచ్చే ఏడాది ప్రారంభంలో అనగా జనవరి 2020లో నూతన చిత్రానికి సంబంధించిన ప్రకటన చేస్తారట. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్ డిటైల్స్ ఆయన వెల్లడిస్తారని తెలుస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది. కాబట్టి ఆ నూతన చిత్రానికి సంబంధించిన చిత్ర షూటింగ్ లో ఆగస్టు తరువాత పాల్గొంటారని వినికిడి. అలాగే చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 152వ చిత్రం షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటారట. ఈ మూవీలో చరణ్ క్యామియో రోల్ చేస్తున్నారట. మరి రామ్ చరణ్ ప్రకటించబోయే తదుపరి చిత్రం ఏ దర్శకుడితో వుండబోతుందోనని ఇప్పటి నుండే అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది.
