దక్షిణాది చలన చిత్రసీమ ఎంతో ఘనంగా జరుపుకునే 66వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నిన్న రాత్రి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో హంగు ఆర్భాటాలతో అట్టహాసంగా జరిగింది. ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను జాతీయ అవార్డుల తరువాత రెండవ అత్యున్నత గౌరవంగా మన స్టార్స్ భావిస్తారు. సందీప్‌కిషన్, రెజీనా ఈ వేడుకకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 2018లో ప్రేక్షకుల మన్ననలు పొందిన పలు సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను అందించారు.
కాగా తెలుగులో 2018 సంవత్సరానికిగానూ మహానటి ఫిల్మ్‌ఫేర్‌లో నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్ర పురస్కారంతో పాటు, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కి, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి మరియు బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ గా దుల్కర్ సల్మాన్ ఈ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికే మహానటి తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
