‘సరిలేరు నీకెవ్వరు’ నుండి అదిరిపోయే ఆంథమ్‌ !

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఆంథమ్‌ వచ్చేసింది. ఆకట్టుకుంటోంది. సైనికుల గొప్పతనంతో పాటు వారి అమూల్యమైన త్యాగాల విలువలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు..’అంటూ మొదలైన దగ్గర నుండి సాంగ్ చివరివరకూ పాట బాగుంది. దేవిశ్రీ పాటను అద్భుతంగా కంపోజ్‌ చేస్తే శంకర్‌ మహదేవన్‌ తన గాత్రంతో పాటకు జీవం పోశారు.

కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version