‘నరకాసురుడు’ రిలీజ్ ఎప్పుడో తెలిసింది

Narakusarabn

‘దురువంగల్ పతిన్నారు’ తో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘నరగసూరన్’. మొదటి నుండి ఈ సినిమాపై భారీ స్థాయి క్రేజ్ నెలకొని ఉంది. ఆరంభంలో బాగానే నడిచిన ప్రాజెక్ట్ మధ్యలో నిర్మాతలకు, దర్శకుడికి వచ్చిన బేధాభిప్రాయాల వలన చాలా ఆలస్యమైంది. చివరికి ప్రాజెక్ట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న దర్శకుడు గౌతమ్ మీనన్ నుండి శ్రద్దా ఎంటర్టెయిన్మెంట్స్ చేతిలోకి వెళ్లింది.

తాజా అప్డేట్ మేరకు ఈ సినిమా షూట్ చివరి దశలో ఉందని తెలుస్తోంది. అంతేకాదు 2020 మార్చ్ నెలకి విడుదలవుతుందని కూడా దర్శకుడు కార్తీక్ నరేన్ తెలిపారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, అరవింద స్వామి, శ్రియ శరన్ లాంటి స్టార్ నటీ నటులు నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘నరకాసురుడు’ పేరుతో విడుదలకానుంది.

Exit mobile version