కమల్ లేకుండానే కానిచ్చేస్తున్నారు

kamal

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇందులో కూడా కమల్ యంగ్, ఓల్డ్ పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ చెన్నైలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది.

అయితే కీలకమైన ఈ షెడ్యూల్లో కమల్ పాల్గొనడం లేదు. కొన్నేళ్ల క్రితం కాలికి సర్జరీ జరిగి అందులో అమర్చిన లోహపు భాగాల్ని ఈమధ్యే మరో సర్జరీ ద్వారా తొలగించుకున్నారు. అందుకే ఆయన విశ్రాంతిలోనే ఉన్నారట. ప్రజెంట్ బాబీ సింహ మీద చిత్రీకరణ జరుగుతోంది. కమల్ ఫిబ్రవరి నుండి షూట్లో జాయిన్ అవుతారని, కాజల్ జనవరి నుండి చిత్రీకరణలో పాల్గొననుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version