రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ వేడుక బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఈవెంట్లో ప్రత్యక్షమై అందరికీ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే, తనకు ప్రమోషన్లలో పాల్గొనడం ఇష్టం ఉండదని కాదని.. తాను స్టేజీలపై సరిగ్గా మాట్లాడలేననే దూరంగా ఉంటానని ఆమె పేర్కొంది. కానీ ‘టాక్సిక్’ తనకు చాలా ప్రత్యేకమైనదని.. యష్ తనకు ఒకే ఒక్క కాల్ చేశాడని.. ఆయన అడగ్గానే రావాలనిపించిందని నయన్ చెప్పుకొచ్చింది.
నయనతార స్వయంగా రావడం, యష్ కోసం ప్రత్యేకంగా మాట్లాడటంతో ‘టాక్సిక్’ సినిమా చాలా స్పెషల్‌గా ఉండబోతోందనే ఫీలింగ్ ఆడియెన్స్‌లో బలపడింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంచనాలను ఆకాశానికెత్తిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
