ప్రభాస్ పైకి అలా కనిపిస్తాడు కానీ లోపల..?

prabhas rajamouli

రాజమౌళి ఎక్కువగా సినిమాలు తీసిన హీరోలలో ప్రభాస్ ఒకరు. మొదటిగా వీరిద్దరి కాంబినేషన్ లో ఛత్రపతి రాగా, బాహుబలి 1, బాహుబలి 2 2015 మరియు 2017లో విడుదలై భారత చలన చిత్ర రికార్డ్స్ తిరగరాశాయి. మరి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి అడిగితే రాజమౌళి ఆసక్తికర సమాధానం చెప్పాడు. ప్రభాస్ పైకి ఓ వెర్రిబాగులోడి లాగా, ఏమి ఎరుగని అమాయకుడిలా కనిపిస్తాడట. కానీ లోపల చాలా మేధావి అట. ఎవరు ఎలాంటి వారు, వారితో ఎలా ఉండాలి అనే విషయాలు తనకు బాగా తెలుసట.

ఏ విషయం పైన అయినా అవగాహన ఉండే ప్రభాస్ పెద్ద ఫిలాసఫర్ అని చెప్పచ్చు అని అని రాజమౌళి ప్రభాస్ గురించి చెప్పాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం గురించి కొన్ని ఐడియాలు డెవలప్ చేస్తున్నారట. ఇక చరణ్, ఎన్టీఆర్ లతో ఆయన చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.

Exit mobile version