ఫ్యాన్ పెళ్లి చేసుకుంటానంటే..పెట్ డాగ్ పర్మిషన్ కావాలంది.

rashmika 4

హీరోయిన్ రశ్మికకు ఆకట్టుకొనే అందమే కాదు, సందర్భానుసారంగా స్పందిచే తెలివితేటలు కూడా ఉన్నాయని నిరూపించుకుంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉంటున్న హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఫాన్స్ తో చాట్ చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక ఇలాగే ఫ్యాన్స్ తో ఆన్లైన్ లో చాట్ చేస్తుండగా ఓ అభిమాని, దేవుడు వరమిస్తే మీ భర్త కావాలని కోరుకుంటాను అని మెస్సేజ్ పెట్టారు. దానికి రష్మిక హిలేరియస్ సమాధానం ఇచ్చింది. తన పెంపుడు కుక్క ఫోటో పోస్ట్ చేసి..’ముందు ఆ కుక్క పర్మిషన్ తీసుకో” అని స్పాంటేనియస్ గా స్పందించింది.

ఇక మరో ఫ్యాన్ దిల్ వాలే సినిమాలో షారుక్ తో కాజోల్ వచ్చినట్లు నాతో 5 నిముషాలు డేట్ కి వస్తావా అని అడుగగా… చూద్దాం అని సమాధానం చెప్పారు. ఇక ఈ ఏడాది రష్మిక సరిలేరు నీకెవ్వరు మరియు బీష్మ రెండు హిట్స్ అందుకొంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version