పీవీపీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ?

pawan kalyan pvp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఓ చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా పీవీపీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని సినిమా చేయడానికి పవన్ నుండి కూడా సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ పవర్ స్టార్ కూడా రీఎంట్రీ ఇస్తూనే వరుస సినిమాలకు సైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా మరి కొంతమంది నిర్మాతలు కూడా పవన్ ను అప్రోచ్ అయ్యారట, కానీ పవన్ నుండి వారికి ఎలాంటి అప్ డేట్ రాలేదని తెలుస్తోంది. పీవీపీకి మాత్రం పవన్ సినిమా చేస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ ఆగష్టు వరకూ షూట్ చేయకూడదు అని నిర్ణయించుకున్నారు.

ఏమైనా పవన్ నుండి ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Exit mobile version