నిన్నటి నుండి నిహారిక తన పెళ్లిపై హింట్స్ అండ్ అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. కొంతకాలంగా నిహారిక పెళ్లి ప్రయత్నాలలో ఉన్న నాగబాబు ఆమె కొరకు ఓ అబ్బాయిని వెతికాడని అర్థం అయ్యింది. ఐతే మొదట వరుడు ఫొటోను నిహారిక పూర్తిగా రివీల్ చేయకుండా అతని ముఖం దాచి కొంచెం కురియాసిటీ పెంచింది. మొత్తానికి నిన్న సాయంత్రం అబ్బాయి పూర్తి ఫోటో ఆమె బయటపెట్టడం జరిగింది.
ఇక వివరాలలోకి వెళితే నిహారికను మనువాడనున్న ఆ అబ్బాయి పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇన్స్పెక్టర్ జనరల్ హోదా పోలీస్ అధికారి అయిన ప్రభాకర్ రావు కుమారుడే ఈ వెంకట చైతన్య. ఇక వీరి నిశ్ఛి తార్ధ కార్యక్రమం ఆగస్టు నెలలో జరగనుంది. అనంతరం పెళ్లి వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
