అల్లరి నరేష్ మూవీలో ఆసక్తి రేపుతున్న కమెడియన్ లుక్.

praveen

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ నాంది. పోలీస్ కస్టడీ లో నగ్నంగా ఉన్న నరేష్ ఉన్న పోస్టర్స్ మూవీపై ఆసక్తి రేపుతున్నాయి. అసలు నరేష్ ని పోలీసులు హింసించడానికి కారణం ఏమిటనేది ఆసక్తికర అంశం. కామెడీ హీరోగా 50 కి పైగా సినిమాలో నటించిన నరేష్ నాందిలో సీరియస్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఓ సామాజిక అంశంపై పోరాడే వ్యక్తిగా ఆయన పాత్ర ఉండే అవకాశం కలదు.

కాగా ఈ మూవీ నుండి మరో పాత్రను పరిచయం చేశారు. నటుడు ప్రవీణ్ కారు డ్రైవింగ్ చేస్తూ వెళుతున్న పోస్టర్ లో ఆయన లుక్ చాలా సీరియస్ గా ఉంది. సీరియస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రవీణ్ పాత్ర కూడా అలానే ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీ నుండి జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ వీడియో విడుదల కానుంది. ఆ ప్రోమో తరువాత ఈ మూవీపై ఓ స్పష్టత వచ్చే సూచనలు కలవు. కనకమేడల విజయ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా..సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

Exit mobile version