పవన్ కి ఉన్నంతగా డై హార్డ్ ఫ్యాన్స్ మరో హీరోకి ఉండరంటే అతిశయోక్తికాదు. ఏ విషయంలో అయినా తమ హీరోని అందరి కంటే ముందు ఉంచాలని వీరు కోరుకుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్లో నేషనల్ లెవెల్ రికార్డును కొల్లగొట్టారు. తమ అభిమాన హీరో పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని, 50 రోజులు ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఈ హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో ఏకంగా 27.3 మిలియన్ల ట్వీట్స్ చేసి రికార్డు క్రియేట్ చేశారు.
గతంలో ఎన్టీఆర్ అభిమానులు 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పగా… ఆ రికార్డును ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తిరగరాశారు. ఇప్పటివరకు ఏ హీరోకు ఇంత పెద్ద మొత్తంలో బర్త్ డే ట్వీట్స్ రాలేదని సమాచారం. మరి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే కే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే, బర్త్ డేని ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేయనున్నారో చూడాలి. కాగా పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా ఫ్యాన్స్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.