‘లోక చాప్టర్ 2’ పై లేడీ సూపర్ హీరో క్లారిటీ!

loakh2

మన ఇండియన్ సినిమా దగ్గర ఈ కొన్నేళ్ల గ్యాప్ లోనే సూపర్ హీరో జానర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి.ఇలా మలయాళ సినిమా నుంచి గత ఏడాది వచ్చిన లేడీ సూపర్ హీరో చిత్రమే ‘లోక చాప్టర్ 1: చంద్ర’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శని మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు డామినిక్ అరుణ్ సాలిడ్ సీక్వెల్ చిత్రాలు భారీ తారాగణంతో సెట్ చేయగా పార్ట్ 2 పై కూడా మంచి బజ్ నెలకొంది.

ఇక ఈ సినిమాపై లేటెస్ట్ గా లేడీ సూపర్ హీరో గర్ల్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నీ సెట్ అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచే షూటింగ్ మొదలు కావచ్చని ఆమె క్లారిటీ ఇచ్చింది. సో ఇది మాత్రం ఈ సినిమా ఫ్యాన్స్ కి ఇంకా కళ్యాణి అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక పార్ట్ 2 లో ఆమెతో పాటుగా టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఇంకా మమ్ముట్టి కూడా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా దుల్కరే నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version