సితార ఎంటర్టైన్మెంట్స్ లో సిద్ధూ ఆసక్తికర ప్రాజెక్ట్.!

narudi
ఇటీవలే “కృష్ణ అండ్ హిస్ లీల” చిత్రంతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఈ నటుడు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఓ ప్రాజెక్ట్ ను చేస్తున్నట్టుగా ఇటీవలే వార్త వచ్చింది. అయితే ఇపుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. నూతన దర్శకుడు విమల్ కృష్ణ ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి వీరు “నరుడి బ్రతుకు నటన” అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. అలాగే ఇంతకు ముందే సిద్ధూతో హీరోయిన్ గా చేసిన శ్రద్దా శ్రీనాథ్ నే మరోసారి ఎంపిక చేసారు. అయితే ఈ చిత్రం పేరు, లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి.ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది.

సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది…ఇలా ఎందుకు…? ప్రేమ కధకుమించి ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఈ దీపావళి నుంచి షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ కు దర్శకుడు విమల్ కృష్ణతో పాటుగా హీరో సిద్ధూ కూడా రచయితగా పని చేస్తుండడం విశేషం. యంగ్ టాలెంట్ కాల భైరవ సంగీతం అందిస్తుండగా సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version