ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బోల్డ్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’.. ఎందులో అంటే!

రీసెంట్ గా యువతలో ఓ రేంజ్ లో హాట్ డిస్కషన్ గా మారిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది బోల్డ్ అండ్ మెసేజ్ తో పాటుగా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని కూడా పంచిన చిత్రం ‘హుషార్ పిట్టలు’ కూడా ఒకటి. దర్శకుడు భిక్షు తెరకెక్కించిన ఈ చిత్రంలో యువ నటీనటులు వాసవి గణేశన్, అన్ష్ లు లీడ్ పాత్రల్లో నటించిన ఈ చిత్రం డీసెంట్ రన్ ని పూర్తి చేసుకుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ బోల్డ్ ఎంటర్టైనర్ ని పాపులర్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో నేటి నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. సో కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నా పర్వాలేదు మంచి మెసేజ్ తో కూడిన ఎంటర్టైనర్ ని సోలోగా చూడాలి అనుకుంటే ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించగా వెంకట్ యాదవ్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version