
సెన్సేషనల్ స్టార్ ‘విజయ్ దేవరకొండ’ తమ్ముడు ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆనంద్ దేవరకొండ’ ఆ సినిమాతో హీరోగా మెప్పించలేకపోయాడు. బలమైన నేపథ్యంలో భావేద్వేగమైన ప్రేమ కథతో దొరసాని చిత్రం తెరకెక్కినా.. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆనంద్ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా షార్ట్ ఫిలిం మేకర్ సంజు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఆనంద్ కు బాగా నచ్చిందట.
కాగా కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో, ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా డు. ముఖ్యంగా కథలోని పాత్ర తనకు బాగా నచ్చిందట. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ విలువైన అవకాశాలని జూనియర్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుంటాడా.. చూడాలి. ఇక ప్రస్తుతం ఆనంద్ మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.