టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథా నేపథ్యం అనుసారం చిరుతో పాటుగా మరో కీలక రోల్ ఉంటుందని ఆ రోల్ ను చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తారని టాక్ కూడా ఖరారు అయ్యింది.
అయితే చిరుకి జోడిగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ చరణ్ కు హీరోయిన్ ను వెతికే పని మాత్రం మేకర్స్ కు ఇంకా పూర్తి కాలేదట. కొన్నాళ్ల నుంచి చరణ్ సరసన రష్మికా మందన్నా ను అనుకున్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మరిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ టాక్ ప్రకారం మేకర్స్ ఓ హిందీ హీరోయిన్ ను దింపాలని చూస్తున్నారట. అది కూడా కియారా అద్వానీను అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కియారా చరణ్ తో “వినయ విధేయ రామ”లో నటించగా వీరి జంటకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి ఈసారి కూడా ఈ అమ్మడు చరణ్ తో జత కడుతుందో లేదో చూడాలి.
