చాలా తక్కువమంది అతిధుల సమక్షంలోనే మెగా డాటర్ వివాహం.!

niharika

ఇప్పుడు మెగా కుటుంబం ఇంట పెళ్లి భాజాలు మోగాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు మెగా డాటర్ నిహారిక అలాగే చైతన్య జొన్నలగడ్డ ల వివాహ వేడుకను రాజస్థాన్ లో ఉదయ్ విలాస్ లో రాయల్ గా ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ప్లాన్ చేసిన ఈ వివాహ వేడుకకు గాను మెగా ఫ్యామిలీ అంతా ఇప్పటికే జాయిన్ అయ్యారు.

ఈ డిసెంబర్ 9న జరుపనున్న ఈ వేడుకకు గాను మెగా కుటుంబం చాలా అంటే చాలా తక్కువ మందినే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మెగా కుటుంబం కాకుండా కేవలం వారు 120 మందిని మాత్రమే ఆహ్వానించారట.

పైగా వారికి ప్రత్యేకంగా చేయించిన పట్టు వస్త్రాలతో వారంతా రానున్నారని తెలుస్తుంది. అయితే ఈ వేడుకకు గాను ప్రముఖ హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, రీతూ వర్మలు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఎలాగో నిహారిక బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి లానే దూరంగా ఉన్నారు.

Exit mobile version