ఇప్పటి వరకు మన తెలుగులో మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా పూర్తి చేసుకోనుంది. అయితే గత మూడు సీజన్లకు మించే ఈసారి రెస్పాన్స్ ను అందుకుంది కానీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఈసారి సీజన్ పై ఫాలోవర్స్ అసలు దారుణంగా విస్తుపోయారని చెప్పాలి.
ఇన్ని రోజులు టాస్కులు అనుకుంటే సరిగ్గా రెండు వారాలు కూడా లేని సమయంలో కూడా ఏవేవో టాస్కులు ఇవ్వడం చూసి సోషల్ మీడియాలో జనం విస్తుపోతున్నారు. ఇక ఇదే అనుకుంటే అసలు కంటెస్టెంట్స్ నడుమ జరిగే దాన్ని కాస్తా ప్రోమోస్ లో ఒకటి చూపిస్తున్నారు కానీ అందుకు పూర్తి విరుద్ధంగా కంప్లీట్ ఎపిసోడ్ లో జరుగుతుంది.
దీనితో సరైన మసాలా ఎంటర్టైన్మెంట్ ను ఆశించే వారికి నిరాశే ఎదురవుతుంది. అప్పటికప్పుడు పీకల్లోతు కోపాలతో గొడవలు పడడం ఏంటో అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తానికి ఈ సీజన్ విషయంలో బిగ్ బాస్ ఫాలోవర్స్ నుంచి చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి.
