పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల టార్గెట్ మిస్సవుతుందా.?

Pawan Kalyan 2

ప్రస్తుతం పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు అనేక సినిమాలను లైన్ లో పెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు శ్రీరామ్ తో తాను నటిస్తున్న “వకీల్ సాబ్” చిత్రం కేవలం కొంత షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అలాగే దీని తర్వాత విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తో కూడా ఒక పీరియాడిక్ ఫిల్మ్ ఉంది.

కానీ ఈ రెండిట్లో మాత్రం క్రిష్ తో సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఒకింత ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని వేసవిలో రేస్ లో ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని నిలపాలని ముందే దర్శకుడు ఫిక్స్ అయ్యిపోయాడు. కానీ అంతకు ముందే సంక్రాంతి రేస్ లో కనుక వకీల్ సాబ్ విడుదల అయ్యిపోయి ఉంటే వేసవికి ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు వకీల్ సాబ్ విడుదలే ఎప్పుడో అర్ధం కాని పరిస్థితి సో క్రిష్ తో ప్లాన్ చేసిన చిత్రం వేసవి టార్గెట్ మిస్సయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి పవన్ ఫ్యాన్స్ దృష్టిలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాలు ఎపుడు విడుదల అవుతాయో చూడాలి.

Exit mobile version