బాలయ్య యాక్షన్ కోసం ప్రత్యేకమైన లొకేషన్స్ !

Balakrishna
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారంలో జరగనున్న షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారు. అయితే పిడుగురాళ్లలో ఈ షూట్ చేయనున్నారు. ఇందులో ఎక్కువగా పోరాట సన్నివేశాలే ఉంటాయట. ఈ మేరకు పిడుగురాళ్లకు దగ్గరలోని పూర్తిగా పలుకురాళ్ళతో నిండిన ఓ గుట్ట ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ ను కూడా ఫైనల్ చేసిన్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. కాగా బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version