తలైవర్ రజినీకాంత్ ఇటీవలే ఆరోగ్యం క్షీణించి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాను హీరోగా నటిస్తహున్న తాజా చిత్రం “అన్నాత్తే” షూట్ లో రజినీ ఉన్నట్టుండి అస్వస్థతకు లోను కావడం అన్ని ఇండస్ట్రీ వర్గాలను అలాగే అభిమానులను ఎంతగానో కలచి వేసిన సంగతి తెలిసిందే.
గత రెండు రోజులు కీలక వైద్యం అందుకున్న రజినీ ఆరోగ్యం పట్ల లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా చేసిన అన్ని పరీక్షల్లో కూడా రజినీకు అంతా నార్మల్ గానే ఉందని తెలిసింది. అంతే కాకుండా ఈరోజు కూడా మరికొన్ని పరీక్షలు చేయనున్నారట వాటి అనంతరమే వైద్యులు తలైవర్ ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అన్నది ప్రకటించనున్నారట. మరి రజినీ అంతే త్వరగా కోలుకొని మళ్ళీ తన పనుల్లో బిజీ కావాలని మనం కూడా కోరుకుందాం.
