మారేడుమిల్లి అడవులకు వెళ్లనున్న బన్నీ !

allu arjun 2

‘పుష్ప’ టీమ్ మారేడుమిల్లిలో జనవరి 8 నుండి మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తమ తదుపరి ప్రధాన షెడ్యూల్ కోసం తిరిగి మారేడుమిల్లి అడవులకు వెళ్ళడానికి పుష్ప బృందం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా జనవరి 7వ తేదీన అల్లు అర్జున్ లొకేషన్ కి బయలుదేరనున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ఈ సినిమాలో ముందుగా బన్నీ – రష్మిక పై సాంగ్ ను షూట్ చేస్తున్నారట. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తోన్న ఈ సాంగ్ పూర్తి అడవి నేపథ్యంలో సాగుతుందట. కాగా శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది.

కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో… ఈ సినిమా మ్యూజిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేవి నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

Exit mobile version