ఆ కథలంటే ఎంత ఇష్టమో చెప్పిన రామ్ చరణ్

ram charan
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్‌ మీట్ మూడవ యానివర్సరీ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథుల్లో ఒకరిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పోలీస్ సేవలను కొనియాడారు. కోవిడ్ ఎమర్జెన్సీ సమయంలో పోలీస్ సేవలు మరువలేనివని, తనకు పోలీసులంటే ఎంతో గౌరవమని అంటూ ధృవ సినిమాలో పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఉన్న గౌరవంతో పాత్రలో చిన్న తప్పు కూడ ఉండకూడదని చాలా కష్టపడ్డాను.

నాకు పోలీస్ కథలంటే ఎంతో ఇష్టం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడ పోలీస్ పాత్రలోనే చేస్తున్నాను. ఎంతోమంది పోలీసుల రియల్ లైఫ్ కథలతో స్పూర్తి పొంది ఆ పాత్ర చేస్తున్నాను అన్నారు. ఇక హైదరాబాద్ సీపీ సజ్జనార్ సైతం ‘ధృవ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ నటనను కొనియాడారు. ఆయన సినిమాలు చూస్తుంటానని, కుటుంబంతో కలిసి చిరంజీవిగారు నటించిన ‘సైరా’ చిత్రం చూశానని, షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ గారిని వేడుకకు పంపినందుకు దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలని అన్నారు.

Exit mobile version