సూర్య కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Surya

తమిళ్ స్టార్ హీరో సూర్యకి చాలా సంవత్సరాలు తరువాత ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి హిట్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉండటంతో.. సూర్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. మరి ఇలాంటి సినిమా తీసిన తరువాత.. మళ్లీ ఎలాంటి సినిమాతో రావాలి. కాగా సూర్య ఇప్పటికే యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. హరికి సూర్య ఈ సారి మనం కొత్తగా చేద్దాం అంటూ లంక ప్రాంతానికి సంబంధించిన ఓ ఐడియాని సూర్య, హారికి చెప్పినట్లు.. హరి ప్రస్తుతం ఆ ఐడియా పై వర్క్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

నిజానికి వీరి కలయికలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథను సినిమాగా రాబోతుందని.. ఇప్పటికే ఇద్దరూ ఓ కథకు కూడా ఫిక్స్ అయ్యారంటూ ఆ మధ్య కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చినా.. అవి నిజం కాదని తేలిపోయింది. మరి ఇప్పుడు లంక నేపథ్యంలో సినిమా అంటే.. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. సూర్య గతంలో ఎన్నడూ అలాంటి సినిమా చేయలేదు. పైగా లంక నేపథ్యం పై తమిళ ప్రజలకు కాస్త ఆసక్తి ఎక్కువు ఉంటుంది. అయితే మార్చి నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందట.

Exit mobile version