ఇన్ని రోజులు అందరి స్టార్ హీరోల టర్న్ అయ్యిపోయింది. ఇక మిగిలిపోయిన స్టార్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. అందరు స్టార్ హీరోలు తమ అభిమానుల కోసం తమ సరికొత్త చిత్రాల టీజర్స్ తో సాలిడ్ ట్రీట్ ఇచ్చేసారు కానీ ప్రభాస్ నుంచి మాత్రం అలా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఎట్టకేలకు తాను చేస్తున్న “రాధే శ్యామ్” టీజర్ కు డేట్ ఫిక్స్ అయ్యింది.
రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ భారీ చిత్రపు మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో వాళ్ళకే తెలుసు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుంది ఎన్ని అంశాలు హైలైట్ అవుతాయి అన్నవి పక్కన పెడితే ఖచ్చితంగా మాత్రం అందులో డామినేటింగ్ అంశంగా కనిపించేది ప్రభాస్ అనే తెలుస్తుంది.
లవర్ బాయ్ గా స్పెషల్ లుక్సే ఈ టీజర్ లో ఫ్యాన్స్ అందరినీ మెస్మరైజింగ్ చెయ్యనున్నాయని అలాగే దీనితో పాటుగా ఆ ఫ్రేమ్స్ కు తగ్గట్టుగా జస్టిన్ ప్రభాకరన్ వండర్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరోసారి మాయ చెయ్యడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ 14 వరకు ఆగక తప్పదు.
