వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాల్గవ రోజు సోమవారం కూడ రూ.5.53 కోట్ల షేర్ రాబట్టుకుంది. ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తూ సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. దీంతో చిత్రం యూనిట్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. రేపు 17వ తేదీన రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్ నందు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. మెగాపవర్ స్టార్ రాకతో సినిమా ప్రచారం మరింత ఊపందుకుని ఈ వారం కూడ వసూళ్లు నిలకడగా కొనసాగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో సినిమా మీద మెగా అభిమానుల్లో హైప్ పెరిగింది. తమ కుటుంబం నుండి వచ్చిన కొత్త హీరో కోసం ఇలా మెగా స్టార్ హీరోలు ముందుకొచ్చి ప్రమోషన్లు చేయడం అభినందించదగిన విషయం.
