లాంగ్ గ్యాప్ తర్వాత యాక్షన్ టర్న్ తీసుకున్న నాగార్జున

nag 1

అక్కినేని నాగార్జున హీరోగా కొత్త చిత్రం ఈరోజే లాంచ్ అయింది. ‘పిఎస్వి గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి బ్యానర్స్‌పై ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుంది. నాగ్ పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేసి చాలాకాలమే అయింది. ఈమధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు లేదా రొమాంటిక్ సినిమాలే. అందుకే ఈసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రం చేయాలని ప్రవీణ్ సత్తారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కాలేదు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. లండన్, ఊటీ, గోవా, హైదరాబాద్ లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఇందులో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. గరుడవేగ చిత్రంతో యాక్షన్ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడనే పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ సత్తారు. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తైన వెంటనే హైదరాబాద్ తిరిగొచ్చి ఈ సినిమాను ప్రారంభించారు నాగార్జున.

Exit mobile version