ఈసారి శ్రీవిష్ణు ‘భళా తందానన’ అంటున్నాడు

srivishnu interw

‘బ్రోచేవారెవరురా’, ‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ వంటి వరుస విజయాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి కొత్త దర్శకులు, నిర్మాతలు చాలా ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రసుతం ఆయన ‘గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున పాల్గుణ’ లాంటి భిన్నమైన సినిమా చేస్తున్నారు.

ఇవన్నీ సెట్స్ మీద ఉండగానే ఇంకొక కొత్త సినిమాకు సైన్ చేశారు ఆయన. ఆ సినిమాకు కూడ భిన్నమైన రీతిలో ‘భళా తందానన’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని చైతన్య దంతులూరి డైరెక్ట్ చేయనున్నారు. ఈయన గతంలో నారా రోహిత్ హీరోగా ‘బాణం’ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా కేథరిన్ థ్రెస నటించనుండగా ‘కెజిఎఫ్’ చిత్రంలో ప్రతినాయకుడు గరుడ పాత్ర చేసిన రామచంద్రరాజు ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Exit mobile version