సినీ పరిశ్రమలో ఇతర విభాగాల్లో మంచి పేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులు దర్శకులుగా మారి మెగాఫోన్ పట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. లారెన్స్, ప్రభుదేవా, గుహన్, సంతోష్ శివన్ లాంటి ప్రముఖులు ఇతర విభాగాల నుండి వచ్చినవారే. ఇప్పుడు వారిలానే పాపులర్ స్టంట్ మాస్టర్ దర్శకుడిగా మారుతున్నారు. ఆయనే స్టంట్ మాస్టర్ సెల్వ. సెల్వ అంటే దక్షిణాది సినిమా పరిశ్రమల్లో బాగా పాపులర్. దాదాపు అందరు స్టార్ హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేశారు ఈయన.
భారీ స్టంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో ఈయన సుమారు 100 సినిమాలు చేశారు. నటుడిగా చిన్న చిన్న పాత్రల ద్వారా స్టార్ హీరోల సినిమాల్లో కనబడ్డారు. ఇప్పుడు ఈయన దర్శకుడిగా టర్న్ తీసుకుంటున్నారు. త్వరలోనే తన సినిమాను అనౌన్స్ చేయనున్నారు. స్వతహాగా స్టంట్ మాస్టర్ కాబట్టి ఆయన చేయబోయేది కూడ హెవీ యాక్షన్ ఎంటర్టైనరే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
