బుమ్రా, అనుపమ మంచి స్నేహితులు మాత్రమే !

burah aupaa
అనుపమ పరమేశ్వరన్ ఒక క్రికెటర్ ని పెళ్లాడనుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అది అబద్ధం అని ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చినా పుకార్లు మాత్రం ఆగలేదు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే బుమ్రా. అతనితో అనుపమ డేటింగ్ లో ఉందనేది టాక్. ఐతే, తాజాగా బుమ్రా పెళ్లి ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అతను చేసుకోబోయే అమ్మాయి ‘అనుపమ’నే అని మళ్ళీ వార్తలు వచ్చాయి.

అయితే ఈ రోజు, అనుపమ తల్లి సునీతా పరమేశ్వరన్ కేరళలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పుకార్లను త్రోసిపుచ్చారు బుమ్రా మరియు అనుపమకు మంచి స్నేహితులు మాత్రమేనని, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఇక ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘హలొ గురు ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ సినిమాలతో టాలీవుడ్ లో మంచి హిట్స్ అందుకున్న అనుపమను, మొదటి నుండి ఆదరిస్తోంది తెలుగు ప్రేక్షుకులే.

Exit mobile version