
తన కన్ను గీటుతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కేరళ అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఓరు ఆదార్ లవ్’ సినిమా బ్రహ్మాండంగా ఆడకపోయినా ప్రియా ప్రకాష్ మాత్రం సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు తెలుగు నుండి కూడ ఆఫర్లు వెళ్లాయి. కానీ ప్రియా ప్రకాష్ ఎందులోనూ ఫైనల్ కాలేదు. కారణం వేరే ఏదో కాదు.. రెమ్యునరేషన్. ప్రియా అడగాల్సిన దానికంటే చాలా ఎక్కువే డిమాండ్ చేయడంతో తెలుగు నిర్మాతలు చేతులు దులిపేసుకున్నారు.
అక్కడితో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. చివరికి ఎలాగో నితిన్, చంద్రశేఖర్ ఏలేటిల ‘చెక్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్ దక్కించుకుంది. అయితే ‘చెక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేదు. ప్రియా ప్రకాష్ స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ కనబడలేదు ప్రేక్షకులకు. దీంతో మరోసారి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న ‘ఇష్క్’ సినిమా ఒక్కటే ఉంది. దాని మీదే ప్రియా ప్రకాష్ ఆశలన్నీ పెట్టుకుంది. అది హిట్టైతేనే ఆమెకు అవకాశాలు.. లేకుంటే కష్టాలే.