
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో పేరు మోసిన సాహిత్య రచయితలు ఉన్నారు మరి వారిలో యువ సాహిత్య రచయిత శ్రీమణి కూడా ఒకరు. 100% లవ్ నుంచి స్టార్ట్ అయిన శ్రీమణి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో చేసిన “రంగ్ దే”లోని అన్ని పాటలకూ తన సాహిత్యం అందించే వరకు వచ్చారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతున్న సందర్భంగా శ్రీమణి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలిపారు.
అలాగే ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా తానే రాయడానికి పూర్తి కారణం దర్శకుడు వెంకీ అట్లూరినే అని తెలిపారు. అతను తనని పూర్తిగా నమ్మాడని తన ఫస్ట్ సినిమా నుంచి నేను వర్క్ చేస్తున్నాను మా ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది కనుకే వెంకీ ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కూడా ఇచ్చారని తెలిపారు.
అలాగే దేవిశ్రీ ప్రసాద్ కు నా ఫ్రీక్వెన్సీ కు కరెక్ట్ గా కూడా సెట్టవుతుంది అని అందుకే లిరిక్స్ ఇంకా క్యాచీగా వచ్చాయని తెలిపారు. మరి ఇప్పుడు రంగ్ దే ఆల్బమ్ కు ఎలాంటి ఆదరణ వస్తుందో తెలిసిందే. మరి ఈ చిత్రంలో నితిన్ కు సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం వచ్చే మార్చ్ 26న విడుదలకు రెడీగా ఉంది.