డే 1 మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

vishnu vinyasam

మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా కొత్త దర్శకుడు ఎదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రమే విష్ణు విన్యాసం. ఒకింత రొటీన్ స్టఫ్ తోనే వచ్చిన ఈ సినిమాని శ్రీవిష్ణు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో లాగేసాడు. ఇలా డే 1 కి మంచి ఓపెనింగ్స్ నే ఈ సినిమా రాబట్టేసింది. ఇలా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.95 కోట్ల గ్రాస్ ని రాబట్టడం విశేషం.

ఇది మాత్రం శ్రీవిష్ణు కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. గత చిత్రం సింగిల్ కంటే తక్కువ బజ్ లోనే వచ్చినప్పటికీ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ప్లస్ అయ్యింది. సో అలా వర్కౌట్ అయ్యి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. అలాగే ఈ వీకెండ్ కి కూడా ఈ చిత్రం మంచి నెంబర్స్ నే అందుకునే ఛాన్స్ ఉంది. మరి ఈ కొన్ని రోజుల్లో ఎంత రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించగా సుమంత్ నాయుడు జి నిర్మాణం వహించారు.

Exit mobile version