పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ భారీ సినిమా మంచి బజ్ ని ఫ్యాన్స్ లో సెట్ చేసుకుంది. అయితే ఇటీవల ఈ సినిమాకి ఓవర్సీస్ డీల్ ఇంకా పూర్తి కాలేదు అని టాక్ ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఫైనల్ గా ఈ డీల్ కూడా పూర్తయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రాన్ని పవన్ గత చిత్రం ఓజి సొంతం చేసుకున్న ప్రత్యంగిరా వారే సొంతం చేసుకున్నారు. వీరి ద్వారానే నార్త్ అమెరికా మొత్తం ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ అనౌన్సమెంట్ పై వదిలిన పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ లో కొత్త అటెన్షన్ ని సొంతం చేసుకుంది.
ఎందుకంటే ఇందులో పవన్ ఇది వరకు వచ్చిన అన్ని పోస్టర్స్ కి డిఫరెంట్ గా ఫన్ అండ్ చిల్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఒక ఆకుపచ్చ రంగు కళ్ళజోడు చేతిలో గన్ ఇంకో పక్కన శ్రీలీల కనిపిస్తున్నారు. దీనితో ఈ ఊహించని షేడ్ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ లో కొత్త బజ్ ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక గ్రాండ్ గా ఈ సినిమా ఈ మార్చ్ 26న రిలీజ్ కి రాబోతుంది.
Neelonchi Kotthagaa Nuvve Molakeththagaa…
Gundello Ganthulegaa…✨Celebrating Our HAT-TRICK Association With Our Beloved POWER STAR @PawanKalyan Garu❤️
Bringing The Fire Of #UstaadBhagatSingh To North America🔥
GRAND PREMIERES On 25th MARCH, 2026💥@harish2you @sreeleela14… pic.twitter.com/Mgr3PsEkbl
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 28, 2026
