రవితేజ సరసన మరోసారి.. నిజమేనా ?

ravi teja raashi khanna
మాస్ మహరాజా రవితేజ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. వారిలో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజతో రాశి ఖన్నా కలిసి నటించింది. ఇప్పుడు మరోసారి రవితేజతో రాశి ఆడిపాడనుంది. ఇక ఈ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది.

ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అదేవిధంగా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. మరి రవితేజ – త్రినాథరావ్ కలయికలో ఎలాంటి కామెడీ వస్తోందో చూడాలి.

Exit mobile version