“RRR” నుంచి నెవర్ బిఫోర్ అవతార్ లో అజయ్ దేవగణ్.!

rrr AjayDevgn

ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో వస్తున్న పలు పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. నేషన్ వైడ్ అగ్ర తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక్కో సాలిడ్ అప్డేట్ ను ఇస్తూ వస్తున్నారు.

మరి అలా లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ రోల్ పై కూడా అప్డేట్ ఇస్తారని కొన్ని రోజుల కితమే చర్చించుకున్నాం. మరి అందులో భాగంగా మేకర్స్ నుంచి ఆ అనౌన్సమెంట్ వచ్చేసింది. అజయ్ దేవగణ్ పై డిజైన్ చేసిన ఒక స్పెషల్ మోషన్ పోస్టర్ టీజర్ ను ఈ ఏప్రిల్ 2న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి అలాగే ఇందులో అజయ్ ను నెవర్ బిఫోర్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపారు. మరి ఇదెలా ఉంటుందో చూడాలి.

Exit mobile version