పవన్ అభిమానులకు నిరాశే మిగిలింది

Vakeel Saab 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘వకీల్ సాబ్’ మీద ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుని ఉన్నారు. పవన్ రీఎంట్రీని పండుగలా సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు. కానీ వారికోరిక నెరవేరేలా లేదు. కోవిడ్ నిబంధనలు అడుగడుగునా వారికి అడ్డుపడుతున్నాయి. ముందుగా ప్రీరిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నారు. చిరు, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా నిర్మాత దిల్ రాజు పెద్ద వేడుక నిర్వహించడానికి రెడీ అయ్యారు. కానీ పోలీసుల నుండి అనుమతులు అందలేదు. అందుకే ఏదైనా స్టార్ హోటల్లో అభిమానులు లేకుండానే కార్యక్రమం చేయబోతున్నారు.

ఇక విడుదల రోజున బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు భావించారు. టికెట్ ధరలకు 1500, 500లుగా ఫిక్స్ చేశారు. ఫ్యాన్స్ అయితే ఈ షోల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే వాటికి కూడ అనుమతులు ఇవ్వమని అంటున్నారు పోలీసులు. ఎప్పటిలానే ‘వకీల్ సాబ్’ విడుదల రోజున నార్మల్ షోలు మాత్రమే ఉంటాయని తేల్చి చెప్పేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెనిఫిట్ షోలతో హంగామా చేయాలనుకున్న అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.

Exit mobile version