కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన ఇష్క్ మరియు సత్యదేవ్ హీరో గా నటించిన తిమ్మరుసు చిత్రాలు తాజాగా థియేటర్ల లో విడుదల అయ్యాయి. ఈ చిత్రాలు థియేటర్ల లో ప్రస్తుతం ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాలకి సంబంధించిన డిజిటల్ ప్రీమియర్ ల విషయం పై తాజాగా ఒక విషయం బయటికి వచ్చింది.
తిమ్మరుసు చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అతి త్వరలో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ సైతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇష్క్ చిత్రం త్వరలో సన్ NXT లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలు థియేటర్ల తర్వాత వీటిలో విడుదల అవుతున్నాయి.