అప్పుడు సీనియర్ నటి ఎంతో బాధ పడిందట !

radhika

సీనియర్ నటి రాధికకు కొన్ని రోజుల క్రితం గాయమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఆమె తన గాయం గురించి ప్రస్తావిస్తూ ఓ మెసేజ్ ను పోస్ట్‌ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎప్పుడూ బలంగా ఉండాలని రాధిక ఈ పోస్ట్ పెట్టారు. ‘నాకు ఈ రెండు నెలలు చాలా బాధగా గడిచాయి. ఓ సినిమా లొకేషన్‌లో నా మోకాలికి గాయం అయింది. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డాను. నొప్పి తగ్గడం కోసం ఎన్నో టాబ్లెట్స్‌ వాడాను. ఎన్నో థెరపీలు చేయించుకున్నాను. కానీ, నాకు మాత్రం నొప్పి తగ్గలేదు. మరోవైపు సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను సర్జరీ చేయించుకున్నాను. అయితే, సర్జరీకి ముందు ఆ నొప్పి భరిస్తూనే అప్పటికే ఒప్పుకున్న సినిమాల షూట్ ను ఫినిష్ చేశాను. నటన పై నాకున్న అంకితభావం అది. దాన్ని చూసే ఓ స్నేహితుడు ఆశ్చర్యపోతూ.. ‘ఇంత కష్టపడుతున్నావు. ఆ నిర్మాతలు నీకు థ్యాంక్స్ చెప్పారా ? లేదా’ అని అడిగాడు. నిజానికి నేను అలాంటివి ఎప్పుడూ ఆశించలేదు. నా పనిపై మాత్రమే నేను దృష్టిపెడతాను. ఇక సర్జరీ సమయంలో నా భర్త నాకు గొప్ప సపోర్ట్‌ ఇచ్చారు. నన్ను చిన్నపిల్లలా చూసుకున్నారు’’ అని రాధిక తెలిపారు.

Exit mobile version