గత ఏడాది తమిళ స్టార్ హీరోలు చాలా మందికి కలిసి రాలేదని చెప్పాలి. వారు చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’, సూర్య ‘కంగువా’, రజినీకాంత్ ‘వేట్టయాన్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ కూడా ‘విదాముయార్చి’తో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. అయితే, ఇప్పుడు ఒక్కరొక్కరిగా హిట్ కొడుతూ అభిమానులు అలరిస్తున్నాడు. ఈ జాబితాలో ముందుగా చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సూర్య కూడా ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రెట్రో’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మే 1న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో సూర్య తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేడా అనేది చూడాలి.
