మన తెలుగు సినిమా దగ్గర ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో నాచురల్ పెర్ఫార్మర్ సుహాస్ కూడా ఒకడు. తన పాత్రలు, నటనతో సుహాస్ తెలుగు సినిమా దగ్గర మంచి ఫేమ్ ని అందుకోగా తాను తమిళ్ లో ఇపుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. తమిళ్ లో కమెడియన్ టర్న్డ్ హీరో సూరి నటిస్తున్న సినిమా “మండాడి” చిత్రంలో సుహాస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మథిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సుహాస్ పై రావడంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి బజ్ ఈ చిత్రంపై నెలకొంది. అలాగే సూరిపై కూడా వచ్చిన పోస్టర్స్ కి తమిళ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ గా మారాయి.
ఈ చిత్రం రెండు భాషల్లో తెరకెక్కిస్తుంటే తమిళ వెర్షన్ కి సూరి హీరోగా చేస్తే సుహాస్ విలన్ గా చేస్తున్నాడని అలాగే తెలుగు వెర్షన్ కి సుహాస్ హీరోగా చేస్తే సూరి విలన్ గా కనిపిస్తాడని ఓ టాక్ వైరల్ గా మారింది. అయితే దీనిపై యంగ్ నటుడు సుహాస్ క్లారిటీ ఇచ్చాడు. మండాడి తన తమిళ మొదటి సినిమా అని అందులో నేను ప్రతినాయక పాత్రలో కనిపిస్తాను అని అలాగే సూరి అన్న నాయక పాత్రలో కనిపించనున్నారు అని ఇంతే తప్ప మరొకటి లేదు అని స్ప్రెడ్ అవుతున్న స్పెక్యులేషన్స్ కి క్లారిటీ ఇది అని తాను తెలిపాడు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
Hello. This is a small clarification on my upcoming Tamil film #Mandaadi, which will also have a Telugu release. Unlike all the speculated rumours, I'll be playing only the Antagonist and Soori anna will be the Protagonist.
— Suhas ???? (@ActorSuhas) May 6, 2025
